: కోర్టు తీర్పుతో బీహార్ మందుబాబులకు పండగ ... మొత్తం మద్యాన్ని జుర్రేశారు!
గత కొన్ని నెలలుగా మద్య నిషేదం అమలులో ఉండడంతో అల్లాడిపోయిన మందుబాబులు బీహార్ లో మద్యనిషేధం అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టు మద్య నిషేధం చట్టాన్ని కొట్టివేయడంతో... మందుబాబులు విజృంభించారు. కోర్టు తీర్పు మందుబాబులకు అనుకూలంగా వెలువడిందన్న క్షణాల్లో సరిహద్దుల్లోని మద్యం దుకాణాల వైపు పరుగులు తీశారు. దీంతో నేపాల్ సరిహద్దులోని మద్యం దుకాణాల్లోని మద్యాన్ని జుర్రేశారు. వీరి ధాటికి కేవలం నాలుగు గంటల్లోనే నేపాల్ సరిహద్దుల్లోని అన్ని మద్యం షాపుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. అయినా సరే బ్లాకులో కొనుక్కునేందుకు కూడా కొందరు మందుబాబులు వెనకాడలేదు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా నేపాల్ మద్యం దుకాణాలు గిరాకీ చేసుకున్నాయి. కాగా, బీహార్ లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఏప్రిల్ 5న మద్యనిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొన్ని నెలలుగా మద్యం అమ్మకాలు లేక బీహారీ మందుబాబులు అల్లాడిపోయారు. హైకోర్టు చలవతో గొంతులు తడుపుకుని మత్తులోకి జారిపోయారు.