: ఆటో డ్రైవర్ కోసం కారుదిగి పరుగెత్తిన సినీ నటి నమిత!


ప్రముఖ సినీ కథానాయిక నమితకు కోలీవుడ్ లో గుడికట్టించినంత భక్తి కలిగిన అభిమానులున్నారు. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా ఆమెపై క్రేజ్ మాత్రం తగ్గలేదు. తమిళనాట ఓ షాప్ ఓపెనింగ్ కు ఆమె వెళ్లినా అక్కడ ట్రాఫిక్ జామ్ కావాల్సిందే. నమితకు అంత ఫాలోయింగ్ ఉంది మరి! అలాంటి నమిత చెన్నైలోని నెల్సన్‌ మాణిక్యం రోడ్డులో కారులో వెళ్తుండగా, ఓ మహిళా ఆటో డ్రైవర్ ఆమె కారును ఓవర్ టేక్ చేసి ముందుకెళ్లిపోయింది. వెంటనే కారుదిగి పరుగెత్తి మరీ నమిత ఆ ఆటో డ్రైవర్ ను పట్టుకుంది. నమిత అలా రోడ్డు మీద పరుగెడుతుండడంతో అంతా బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. కొంత మంది అక్కడ షూటింగ్ ఏదైనా జరుగుతోందా? అనుకున్నారు. అయితే నమిత పరుగెత్తినది మహిళా ఆటో డ్రైవర్ ధనలక్ష్మితో సెల్ఫీ కోసం అట! కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న ధనలక్ష్మి కంటే స్పూర్తివంతమైన వారు ఎవరుంటారని పేర్కొన్న నమిత... ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి తెలుసుకుంది. దీంతో ధనలక్ష్మి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఇది నిజమేనా? అని నమితనే ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News