: సమంత మతం మారలేదు...మీడియా కథనాలు తప్పు: నాగచైతన్య


సినీ నటి సమంత మతం మారిందని, ఘర్ వాపసీ జరిగిందని... శభాష్ నాగచైతన్య అంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ఒక వర్గానికి చెందిన ఆమె అభిమానులు ఆమె నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనిపై నాగచైతన్య వివరణ ఇచ్చాడు. తనకు మతంతో సంబంధం లేదని అన్నాడు. సమంత మతం మారలేదని చెప్పాడు. సమంత మతం చూసి తాను ఇష్టపడలేదని తేల్చిచెప్పాడు. సమంత రోమన్ క్యాథలిక్ అని, ఆమె కూడా తనను మతం చూసి ఇష్టపడలేదని తెలిపాడు. ముందు తామిద్దరం ఇష్టపడ్డ తరువాతే మిగిలినవి కలిశాయని స్పష్టం చేశాడు. పెద్దలతో కలిసి తామిద్దరం బాగుండాలనే పూజలు నిర్వహించామని అన్నాడు. క్షేమం కోసం చేసిన పూజలో మతంతో సంబంధం ఉంటుందని తాను భావించడం లేదని నాగచైతన్య చెప్పాడు.

  • Loading...

More Telugu News