: పాకిస్తాన్ లో భూకంపం... రాజధాని ఇస్లామాబాద్ లోనూ ప్రకంపనలు


ఈ రోజు మధ్యస్థాయి భూకంపం పాకిస్తాన్ ను వణికించింది. రాజధాని ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంక్వా సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలకు జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్వాత్ లోయలోని మింగోరా పట్టణానికి తూర్పు వైపున 117 కిలోమీటర్ల దూరంలో కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్టు అమెరికన్ జియోలాజికల్ సర్వే విభాగం తెలిపింది. భూగర్భంలో 43.4 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పాకిస్తాన్ లోని ప్రాంతీయ విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది.

  • Loading...

More Telugu News