: స్వచ్ఛభారత్ ను ఉద్యమంగా నిర్వహించాలి: చంద్రబాబు
అన్ని శాఖల అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు తన కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా నిర్వహించాలని అన్ని శాఖలకు సూచించారు. పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమన్నారు. పరిశుభ్రత సంస్కృతిలో భాగం కావాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దోమల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి యాంటీ లార్వా మందులను చల్లాలని ఆదేశించారు.