: టీమిండియా ఆలౌట్.. అర్ధ సెంచరీతో ఆదుకున్న సహా
కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్స్ లో కొనసాగుతున్న భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టులో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా ఆలౌటయింది. భారత్ 7 వికెట్ల నష్టానికి 239 పరుగులతో ఈరోజు బ్యాటింగ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సహా (54పరుగులు) మైదానంలో చక్కగా రాణించి అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, జడేజా 14 పరుగులకి ఔటయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కుమార్ 5 పరుగులు చేయగా, మహమ్మద్ స్యామీ 14 పరుగులు చేశాడు. టీమిండియాకు మరో 18 పరుగులు ఎక్స్ ట్రాస్ రూపంలో వచ్చాయి. దీంతో 316 పరుగులు చేయగలిగింది. టీమిండియా రన్ రేట్ ఓవరుకి 3.01 గా నమోదైంది. మొదటి ఇన్సింగ్స్‌లో ధావన్ 1, విజయ్ 9. పుజారా 87, కోహ్లీ 9, రహానే 77, శర్మ 2, అశ్విన్ 26, సహా 54 (నాటౌట్), జడేజా 14, కుమార్ 5, మహమ్మద్ స్యామీ 14 పరుగులు చేశారు.