: ఆర్థిక ఇబ్బందులతో పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య.. చెల్లిని బాగా చూసుకోవాలంటూ సూసైడ్ నోట్


ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి చెందిన కొడాలి వెంకటరమణ అలియాస్ అబ్బు(20) విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో పాటిటెక్నిక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి లేకపోవడంతో తల్లే కుటుంబ భారాన్ని మోస్తోంది. ఇటీవల కళాశాల ఫీజు కట్టేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో అబ్బు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘అమ్మా నన్ను క్షమించు. నా వల్ల నీకు అన్నీ కష్టాలే. నావల్ల నీకు ఎలాంటి మేలు జరగలేదు. చెల్లిన బాగా చూసుకో. పెళ్లి చెయ్యి. నా వల్ల నువ్వు పడిన ఇబ్బంది చాలు. ఇక సెలవు’’ అంటూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబ్బు మరణవార్తతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. అతని ఆత్మహత్య గురించి తెలిసిన సహచర విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News