: స్వల్పంగా పెరిగిన పెట్రోల్... తగ్గిన డీజిల్ ధరలు


అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో చమురు కంపెనీల కన్సార్టియం పెట్రోలు, డీజిల్ ధరలను సమీక్షించింది. దీంతో పెట్రోలు ధరను స్వల్పంగా పెంచిన కన్సార్టియం, డీజిల్ ధరను తగ్గించింది. లీటరు డీజిల్ పై 0.06 పైసలు తగ్గించిన కన్సార్టియం, లీటరు పెట్రోల్‌ పై 0.28 పైసలు పెంచింది. సవరించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం కన్సార్టియం తెలిపింది.

  • Loading...

More Telugu News