: మెరుపు దాడులంటే ఎలా ఉంటాయో ఇండియాకు రుచిచూపిస్తాం: హఫీజ్ సయీద్


కాందహార్ హైజాక్ లో భారత్ నుంచి విడుదలైన ఉగ్రవాది, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ వాగడం మొదలుపెట్టాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇండియన్ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ఆరోపించాడు. నిజమైన మెరుపు దాడులంటే ఏమిటో ప్రతి భారతీయుడికి రుచి చూపిస్తామని హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. త్వరలోనే భారతదేశానికి తమ దళాలు (పాక్ ఆర్మీ) తగిన గుణపాఠం చెబుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News