: మసూద్ అజహర్ నోరు మూయించిన నవాజ్ షరీఫ్!


భారత అంటే అంతెత్తున ఎగిరిపడే జైషే-ఇ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఉన్నపళంగా భారత్ వెళ్లి దొరికినంత మందిని చంపేయాలని, లేదా భారత సైన్యం చేతిలో చావాలన్నంత ఆవేశంతో ఉన్నాడు. అతను అంతలా రగిలిపోవడం వెనుక కారణం ఏంటంటే... ఇండియన్ ఆర్మీ చేసిన మెరుపుదాడిలో హతమైన ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది జైషే-ఇ-మహ్మద్ కు చెందినవారే! భారత్ లో మారణకాండ సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలన్నీ భారీ మొత్తాలను ఎరగా చూపించి నిరుపేదలైన, మత విశ్వాసాలు అధికంగా గల యువకులను ఎగదోస్తాయి. అందులో మసూద్ కు చెందిన జైషే-ఇ-మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌ వారు అధికంగా ఉంటారు. అలా ఈ మూడు సంస్థలు కలిపి తయారు చేసిన ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి. దీంతో మసూద్ అజహర్‌ రగిలిపోతున్నాడు. ఏ మాత్రం ఊహించని ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో తన ప్రసంగాలతో కశ్మీరీ ముస్లిలను రెచ్చగొట్టి భారత్‌ పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్నాడు. అతని ఆలోచనలకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అడ్డుతగిలాడు. ఎందుకంటే పాక్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ బూటకమని వాదిస్తోంది. ఇప్పుడు మసూద్ అజహర్ నోరిప్పితే తమ డ్రామా బట్టబయలవుతుంది. దీంతో పాక్ లో ఆర్మీ తిరుగుబాటుతో సహా, ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఇక ఇదే సమయంలో వచ్చే నవంబర్ లో పాక్ ఆర్మీ చీఫ్ రిటైర్ కానున్నాడు. దీంతో ఆయన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు కేసులున్న మసూద్ అజహర్ కు తీవ్ర హెచ్చరికలు చేసి, ప్రభుత్వం అతనిని అదుపులో ఉంచింది. అంతకంటే ముందు ఈ మూడు ఉగ్రవాద సంస్థలు ఏర్పాటు చేసిన (ఇండియన్ ఆర్మీ చంపేసిన) శిబిరాల్లో ఉగ్రవాదుల ఆనవాళ్లు లేకుండా చేసింది. తద్వారా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, వారంతా భారత్ కు వెళ్లిపోయారనే భ్రమ కల్పించింది. దీంతో భారత్ అంటేనే రగిలిపోయే ఉగ్రవాద సంస్థ నేత నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • Loading...

More Telugu News