: అప్పుడంటే డబ్బుకోసం ఆ యాడ్స్ చేశాను...ఇప్పుడు చేయను: సోనాలీ బెంద్రే ప్రకటన
చిన్నతనంలో ఉండగా డబ్బు అవసరమై ఫెయిర్ నెస్ క్రీముల యాడ్స్ చేశానని బాలీవుడ్ నటి సోనాలీ బెంద్రే తెలిపింది. 'పర్చేద్' నటి తనిష్ఠా ఛటర్జీపై హిందీ టీవీ షో 'కామెడీ నైట్స్ బచావ్'లో చోటుచేసుకున్న పరిణామాలపై సోనాలీ స్పందించింది. శరీరం రంగును బట్టి మనిషిని అంచనా వేయడం అనాగరికం అని చెప్పింది. ఇప్పుడు తనను ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ చేయమంటే తిరస్కరిస్తానని తెలిపింది. శరీరరంగు దేనికీ కొలమానం కాదని సోనాలీ అభిప్రాయపడింది. ఎవరైనా ఒక వ్యక్తి స్కిన్ టోన్ గురించి జోకులు వేయడాన్ని ఖండించాల్సిందేనని పేర్కొంది. ఇలాంటి విషయంలో సమాజంలో మంచి స్పందని ఉందని ఆమె అభినందించింది.