: ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీలో తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీలో ఇండోసాన్ ఎగ్జిబిషన్ లో ఏసీ సిలిండర్ గ్యాస్ లీక్ కావడంతో అక్కడ ఉన్న అధికారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు. అదే సమయంలో అక్కడి నుంచి చంద్రబాబు బయటకు వస్తున్నారు. వెంటనే, ఎన్ఎస్ జీ కమాండోలు చంద్రబాబుకు రక్షణగా నిలిచి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. కాగా, స్వచ్ఛ భారత్’ ఉద్యమం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు తదితరులు హాజరయ్యారు.