: సీఐఎస్ఎఫ్ సేనలు సిద్ధంగా ఉన్నాయి: మాజీ డైరెక్టర్ జనరల్


దేశ రక్షణలో భాగంగా సేవలందించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సేనలు సిద్ధంగా ఉన్నాయని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్ సురేందర్ సింగ్ అన్నారు. హకీంపేటలోని సీఐఎస్ఎఫ్ లో నిర్వహించిన 42వ బ్యాచ్ పాసింగ్ పరేడ్ ఔట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేందర్ సింగ్ మాట్లాడుతూ, శాంతి పరిరక్షణతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ జగ్బీర్ సింగ్, డీఐజీ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, 28 అసిస్టెంట్ కమాండెంట్స్, 521 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

  • Loading...

More Telugu News