: నేను ఓడిపోతే నగరం వీడతా.. నువ్వు ఓడిపోతే అదే పనిచేస్తావా?: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు మేయర్ సవాల్
నెల్లూరు నగర వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ సవాల్ విసిరారు. ‘మన పదవులకు రాజీనామా చేసి ఇద్దరం మళ్లీ పోటీ చేద్దాం. నేను ఓడిపోతే నగరం వదిలి వెళ్లిపోతాను. నువ్వు ఓడిపోతే నగరం వదిలి వెళ్లిపోతావా?’ అంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు ఆయన సవాల్ విసిరారు. నెల్లూరు నగర సమస్యలపై ఎమ్మెల్యే ఎన్నడూ పట్టించుకోలేదని, గత పాలకవర్గం చేసిన రూ.40 కోట్ల అప్పులను తీర్చి .. నగరాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నానని అబ్దుల్ అజీజ్ అన్నారు.