: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌ర్ష‌సూచ‌న‌


ఇటీవ‌ల కురిసిన భారీవ‌ర్షాల ధాటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మయిన సంగ‌తి తెలిసిందే. వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. మ‌రోవైపు జ‌లాశ‌యాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. మ‌రికొన్ని జ‌లాశ‌యాలు పూర్తిగా నిండాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో మ‌రోసారి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. దీని ప్రభావంతోనే రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వర్షాలు ప‌డే అవకాశముందని తెలిపారు.

  • Loading...

More Telugu News