: భారత సైనికుడి విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తాం: రాజ్ నాథ్


పొరపాటుగా దేశ సరిహద్దు దాటి పాక్ అధీనంలోని భూభాగంలోకి వెళ్లి అక్కడి సైనికులకు చిక్కిన భారత్ జవాను విడుదల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత జవాను పాక్ దళాల నిర్బంధంలో ఉన్నాడంటూ మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్నామని, జవాను విడుదలకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఈ రోజు ఢిల్లీలో విలేకరులకు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. 37 పీఆర్ విభాగానికి చెందిన జవాను గురువారం నియంత్రణ రేఖ దాటి వెళ్లినట్టు, దీనిపై పాక్ దళాలకు డీజీఎంవో టెలిఫోన్ ద్వారా తెలియజేసినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. అనుకోకుండా సరిహద్దులు దాటడం అన్నది అసాధారణం ఏమీ కాదని, ఇలాంటి సమయాల్లో అమల్లో ఉన్న విధానం ప్రకారం వారు వెనక్కి తిరిగి వస్తారని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు భారత సైనికులు 8 మందిని కాల్చి చంపినట్టు పాక్ పత్రికల్లో వచ్చిన కథనాలు తప్పుడు కథనాలుగా అర్మీ వర్గాలు స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News