: పాక్ సైన్యానికి చిక్కిన మన సైనికుడు
పొరపాటున సరిహద్దు దాటిన భారత సైనికుడు పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కాడు. పాక్ సైన్యానికి చిక్కిన చందూలాల్ అనే సైనికుడిని విడిచిపెట్టాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే ఆ దేశానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయమై పాక్ ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. కాగా, నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాద శిబిరాలపై మొన్న అర్ధరాత్రి జరిగిన దాడుల్లో చందూలాల్ పాల్గొనలేదని, పొరపాటున ఈరోజు ఉదయం సరిహద్దు దాటినట్లు సమాచారం. అయితే, పాక్ సైన్యానికి తమ సహచరుడు చిక్కడంపై భారత్ జవాన్లు, ఆ సైనికుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.