: ఉన్మాదిగా మారి అందరిపై దాడి చేస్తున్న మహిళ
ఒక మహిళ ఉన్మాదిగా మారి అందరిపై దాడి చేస్తున్న సంఘటన హైదరాబాద్ నేరెడ్ మెట్ లోని రామబ్రహ్మంనగర్ లో చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను నీటి సంపులో వేసేందుకు ఆ మహిళ యత్నించింది. అయితే, ఉన్మాది మహిళను అడ్డుకున్న చిన్నారుల తల్లిపై ఆమె కారం చల్లి గాయపరిచింది. ఆ మహిళ పేరు సౌజన్య అని, ఆమెను పట్టుకుని నేరెడ్ మెట్ పోలీసులకు అప్పగించామని స్థానికులు తెలిపారు.