: సైన్యం చర్యపై స్పందించిన అసదుద్దీన్.. సైన్యం వెంటేనంటూ ప్రకటన
భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలను సైన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దేశం, సైన్యానికి ఎంఐఎం పూర్తి మద్దతు పలుకుతోందని పేర్కొన్నారు. దేశ సాయుధ బలగాలకు సంఘీభావం తెలుపుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము దానికి వ్యతిరేకమని పేర్కొన్న అసదుద్దీన్, భారత సైన్యానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.