: ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చేసిన రైలు... అమెరికాలో దుర్ఘటన!


'మరి కొద్ది సేపట్లో మీరు వెళ్లాల్సిన రైలు కాసేపట్లో ఫ్లాట్ ఫాం మీదికి రానుంది..' అంటూ అనౌన్స్ చేసిన కాసేపటికే రైలు సరాసరి ఫ్లాట్ ఫాంపైకి ఎక్కేసిన ఘటన అమెరికాలోని న్యూజెర్సీలోని హోబోకెన్‌ రైల్వే స్టేషన్‌ లో చోటుుచేసుకుంది. రైలు ఒక్కసారిగా ఫ్లాట్ ఫాంపైకి ఎక్కేయడంతో ఫ్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు కకావికలమైపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. అయినప్పటికీ ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, సుమారు వంద మంది గాయపడ్డారు. రైల్వే టెర్మినస్ పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చిన ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూస్తే అక్కడి పరిస్థితి ఎంత భీతావహంగా ఉందో తెలుస్తుంది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

  • Loading...

More Telugu News