: అయ్యో... పాక్ రక్షణ మంత్రి ప్యాంటు జారిపోయింది!


పాక్ రక్షణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ ఊడిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయు, సైనిక బలగాలు మెరుపుదాడులు చేసి 38 మంది ముష్కరులను హతమార్చారని తెలియగానే...పాకిస్థాన్ రక్షణ మంత్రి ప్యాంటు వీడిపోయిందని పేర్కొంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. నిజానికి ఇది పాత వీడియోనే...ఏదో సందర్భంగా అతిథులను ఆహ్వానిస్తున్న ఖ్వాజా మహ్మద్ ప్యాంటు ఊడిపోయింది. దీంతో ఆయన తీవ్ర అవమానానికి గురయ్యారు. దీనిని చూసిన నెటిజన్లు... ఒంటిమీద ప్యాంటునే కాపాడుకోలేని మంత్రి అణ్వస్త్రాలు వేస్తామంటూ భారత్‌ ను బెదిరిస్తున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. భారత్ తో పాటు పాక్ మీడియాలో కూడా ఈ వీడియో సర్క్యులేట్ కావడం విశేషం. ఈ వీడియో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం చూసేసి, నవ్వుకోండి!

  • Loading...

More Telugu News