: నిన్న రాత్రి ముందు నుంచి భారత్, వెనుక నుంచి ఇరాన్ దాడులు... జుట్టుపీక్కుంటున్న పాకిస్థాన్!
భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ పాకిస్తాన్ పై ఆ దేశం లేశమాత్రమైనా అనుమానించని రీతిలో ఇరాన్ కూడా గత రాత్రి దాడికి దిగింది. ముందు నుంచి భారత్, వెనుక నుంచి ఇరాన్ దాడికి దిగడంతో ఎందుకిలా జరిగిందంటూ పాకిస్థాన్ జుట్టు పీక్కుంటోంది. పాకిస్థాన్ ఏకంగా నాలుగు దేశాలతో (ఇండియా, చైనా, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్) సరిహద్దులు పంచుకుంటోంది. ఈ నాలుగు దేశాల్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ లు పాక్ కు శత్రువులు. ఇరాన్ తో వాస్తవానికి శత్రుత్వం ఉన్నప్పటికీ బెలుచిస్థాన్ రెబల్స్ కారణంగా ఆ దేశంతో స్నేహ సంబంధాలు బాగానే ఉన్నాయి. బలూచ్ ప్రజలు ఇరాన్ లోని సిస్థాన్ తమ ప్రాంతానికి చెందినదిగా భావిస్తారు. దీంతో ఆ ప్రాంతం కోసం వారు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. దీంతో ఇక్కడ వారితో ఉద్రిక్తతలు ఉన్నాయి. బలూచ్ ప్రజలను అణచివేసే పాకిస్థాన్ కు ఇరాన్ ఆ రకంగా మిత్రురాలైంది. అలాంటి దేశం భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ కి దిగిన వేళ, తను మోర్టార్లతో దాడికి దిగింది. రెండు దాడులు ఒకే సమయంలో చోటుచేసుకోవడంతో ఇరాన్ తమపై ఎందుకు దాడికి దిగిందో తెలియని పాకిస్థాన్, అందుకు గల కారణాలు ఆరా తీసే పనిలో ఉంది.