: ప్రముఖులకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ
నియంత్రణ రేఖను దాటి భారత సైనికులు ఉగ్రస్థావరాలపై చేసిన దాడితో భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘంతో ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో భేటీ ముగిశాక పలువురు ప్రముఖులకు ఫోన్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు పలువురికి ఫోన్ చేసి భారత సైన్యం తీసుకున్న చర్యలు, పాక్ ఆగడాల అంశంపై స్వయంగా వివరించి చెప్పారు.