: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో మోదీ సర్కార్ కు అండగా ఉంటాము: సోనియా గాంధీ


సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కు తాము అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దాడుల ద్వారా పాకిస్థాన్ కు గట్టి సందేశమిచ్చినట్లు అయిందని పేర్కొన్నారు. భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల బాధ్యత పాకిస్థాన్ దేనని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, తమ దేశంలో ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించడానికి పాకిస్థాన్ ఇకనైనా చరమగీతం పాడాలని సోనియాగాంధీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News