: ఉగ్రవాదులు వచ్చేశారు... మొందార్ సెక్టార్ లో ఎన్ కౌంటర్ షురూ!
భారత్ లక్షిత దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్ ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. ఒకటి కాల్పుల ఉల్లంఘనల ముసుగులో ఉగ్రవాదులను భారత్ లోపలికి చొప్పించడం. మరొకటి, తమ భూభాగంలో భారత్ చేసిన దాడుల్లాంటివే మరో దాడులు చేసేందుకు రంగం సిధ్దం చేయడం. అందులో భాగంగా తొలి వ్యూహాన్ని అమలు చేస్తోంది. జమ్మూకాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలోని మెందార్ సెక్టార్ లో భారీ ఎత్తున ఉగ్రవాదులను చొప్పిస్తోంది. పాకిస్థాన్ వ్యూహాలు ముందే పసిగట్టిన భారత దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టే కార్యక్రమం మొదలు పెట్టాయి. దీంతో మెందార్ సెక్టార్ లో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఆర్మీ నుంచి వేగంగా ప్రతిఘటన ఉంటుందని ఊహించని ఉగ్రవాదులు అక్కడి ఫారెస్ట్ లో దాక్కున్నారు. ఇండియన్ ఆర్మీ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదులుతోంది. ఇదే సమయంలో భారత నిఘా వర్గాలు స్లీపర్ సెల్స్ పై ఓ కన్నేసి ఉంచాయి.