: భారత సైన్యం చేసిన సాహసాన్ని ప్రశంసించిన కాంగ్రెస్


పాక్ చేస్తోన్న ఆగ‌డాలు మ‌రింత అధిక‌మ‌వ‌డంతో ఆ దేశంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న భార‌త సైన్యం నిన్న‌ నియంత్రణ రేఖను దాటి చేసిన దాడిని కాంగ్రెస్ పార్టీ స‌మ‌ర్థించింది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ట్వీట్ ద్వారా తెలిపారు. మ‌రోవైపు ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా కూడా ఈ అంశంపై స్పందించారు. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం తీసుకున్న నిర్ణ‌యాన్ని, దాడిని త‌మ పార్టీ సమర్థిస్తోందని చెప్పారు. వారి ధైర్యసాహసాలకు తాము సెల్యూట్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News