: ఆనవాయతీకి బ్రేక్.. వాఘా సరిహద్దుల్లో ‘బీటింగ్ రిట్రీట్’ రద్దు


భారత్-పాక్ ల మధ్య రాకపోకలకు అధికారిక మార్గం పంజాబ్ లోని వాఘా సరిహద్దు ప్రాంతం. స్నేహం, సుహృద్భావానికి ప్రతీకగా రెండు దేశాలు ‘బీటింగ్ రిట్రీట్’ నిర్వహించడం 1959 నుంచి వస్తున్న ఆనవాయతి. ప్రతిరోజూ సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద ‘బీటింగ్ రిట్రీట్' నిర్వహిస్తుంటారు. బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రెండు దేశాల ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News