: ఉద్యోగమిస్తానని పిలిచి రేప్ చేశాడు... కాంగ్రెస్ ఎంపీపై యువతి ఫిర్యాదు


కాంగ్రెస్ ఎంపీ షాదీలాల్ బాత్రా అత్యాచార ఆరోపణల్లో చిక్కుకున్నారు. మత్తుమందు కలిపిన శీతల పానీయం ఇచ్చి తనపై ఎంపీ షాదీలాల్ బాత్రా అత్యాచారం చేసినట్టు ఓ యువ మహిళా న్యాయవాది ఢిల్లీలోని తిలక్ నగర్ మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు. షాదీలాల్ బాత్రా (76) హర్యానా రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో ఉన్న తన నివాసానికి ఎంపీ షాదీలాల్ ఆమెను ఈ నెల 24న ఆహ్వానించారు. అక్కడికి వెళ్లిన తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేసినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు చెప్పవద్దని బెదిరించినట్టు కూడా తెలిపింది.

  • Loading...

More Telugu News