: మరింత సమర్థవంతంగా స్వచ్ఛభారత్: వెంక‌య్య‌ నాయుడు


రెండు సంవ‌త్స‌రాల క్రితం గాంధీ జ‌యంతి రోజున‌ ఎన్డీఏ స‌ర్కారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశపెట్టిన స్వ‌చ్ఛ‌భార‌త్‌ను ప్ర‌జ‌ల్లోకి మ‌రింత బ‌లంగా తీసుకెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించుకున్న‌ట్లు కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు చెప్పారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... రానున్న‌ అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛభారత్ వారోత్సవాలు నిర్వహించ‌నున్నట్లు పేర్కొన్నారు. స్వ‌చ్ఛ భార‌త్ రాజ‌కీయ కార్య‌క్ర‌మం కాదని, అది ప్ర‌జ‌లదేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌క‌ ప్రాధాన్య‌త‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తీసుకురావ‌డ‌మే త‌మ లక్ష్య‌మ‌ని చెప్పారు. ప‌లు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు అద్భుతంగా కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న కొనియాడారు. మరింత సమర్థవంతంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News