: డీజీఎంఓ ప్రకటన ప్రభావం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
గత రాత్రి నియంత్రణ రేఖ వెంబడి మోహరించి ఉన్న ఉగ్రవాదులపై దాడులు చేపట్టామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) ప్రకటన ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడటంతో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఈ ప్రకటనతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో, సెన్సెక్స్ 395 పాయింట్లకు పైగా, నిఫ్టీ 126 పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.