: స్పోర్ట్స్ కోటా ప్రయోజనాన్ని ఆశిస్తున్న విద్యార్థులకు శుభవార్త.. ఏపీ వైద్య విద్య ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటా పునరుద్ధరణ


ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రవేశాలు ఆశిస్తున్న విద్యార్థులకు సుప్రీంకోర్టు ఈరోజు శుభవార్త అందించింది. ఆ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను ర‌ద్దు చేస్తూ గ‌తంలో హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎంతో నిరాశ చెందిన విద్యార్థులు అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈరోజు వారికి సానుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. మెడిక‌ల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రవేశాలు పున‌రుద్ధ‌రించాలని పేర్కొంది. క్రీడల ప్రాధాన్యం ఆధారంగా ప్ర‌వేశాలు క‌ల్పించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News