: పవన్ ను కలవాలని వచ్చిన యువతి.. ఇంటి ముందు బైఠాయింపు


పవన్ కల్యాణ్ అభిమాని అయిన ఓ యువతి పోలీసులను కంగారు పెట్టించింది. జ్యోతి అనే ఆమె పవన్ కల్యాణ్ ను కలవాలని గత నాలుగు రోజులుగా ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని పవన్ నివాసానికి చేరుకుంది. ఉన్నట్టుండి బుధవారం రాత్రి తాను పవన్ కల్యాణ్ ను కలుస్తానని, లోపలికి పంపించాలంటూ అక్కడున్న సిబ్బందితో వాగ్వివాదానికి దిగింది. వారు ఎంత నచ్చజెప్పినప్పటికీ ఆమె వినలేదు. దీంతో వారు చేసేదిలేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పవన్ నివాసం వద్దకు చేరుకుని ఆమెను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో నిరసనగా యువతి రోడ్డుపై బైఠాయించింది. తన పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ హడావిడి సృష్టించింది. కంగారుపడ్డ పోలీసులు ఆమెకు ఏదోలా నచ్చజెప్పి ఎట్టకేలకు ఆమెను స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News