: సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకిస్తూనే ఉంటా: రాహుల్ గాంధీ


సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ ను తాను ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మహాత్మాగాంధీని చంపింది ఆర్ఎస్ఎస్సే నంటూ గతంలో రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మండిపడ్డ సదరు సంస్థ గోహటి కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం రాహుల్ గాంధీ ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై పెట్టే కేసులకు తానేమీ భయపడనని, పేద, బడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి తాను పాటు పడుతున్నందునే ఇటువంటి కేసులు తనపై పెడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

  • Loading...

More Telugu News