: ఎన్టీఆర్ లేని ‘మహాభారతం’ ఉండదు.. ఆ సినిమాలో ఆయనే హీరో: సన్నిహితులతో రాజమౌళి


ఎన్టీఆర్ లేని మహాభారతం ఉండదని, మహాభారత కథతో తాను త్వరలో తెరకెక్కించబోయే సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆరే హీరో అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన స్నేహితులతో అన్నట్టు ఫిలింనగర్ టాక్. బాహుబలి సినిమాతో భారీ చిత్రాలను నిర్మించడంలో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న రాజమౌళి అంతకుమించిన భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. మహాభారతంలోని కథతో సినిమాను తెరకెక్కించనున్నట్టు ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. అందులో భాగంగా వివిధ పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో జక్కన్న ఉన్నట్టు సమాచారం. ఆ సినిమాలో మాత్రం యంగ్‌టైగర్ ఎన్టీఆరే హీరో అని, ఆయన కోసం అందులో కొన్ని పాత్రలు వున్నాయని రాజమౌళి నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తన స్నేహితులతో చర్చించినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Loading...

More Telugu News