: తిరుమల పోటులో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు
తిరుమల పోటులో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. వడ ప్రసాదం తయారీ సమయంలో నూనె చిందడంతో కార్మికుడికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది, క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో సుమారు మూడు నెలల క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బూందీ తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో సిబ్బంది భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.