: ఆసీస్ మాజీ క్రికెటర్ మ్యాక్స్ వాకర్ కన్నుమూత
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మ్యాక్స్ వాకర్(68) ఈరోజు మృతి చెందారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు 1972-1981 మధ్య కాలంలో ఆయన సారధ్య బాధ్యతలు వహించారు. టెస్టు కెరీర్‌లో మొత్తం 34 మ్యాచులాడిన మ్యాక్స్ వాకర్ 138 వికెట్లు తీశారు. 17 వన్డేల్లో 20 వికెట్లు తీశారు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును ఆయన ఆరు సార్లు సాధించారు. తన చివరి మ్యాచును ఇంగ్లాండ్ టీమ్‌తో ఆడిన ఆయన ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ రాణించి 78 పరుగులు చేశారు. తన కెరీర్‌లో 19.53 సగటుతో మొత్తం 586 పరుగులు చేశారు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆయన వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు.