: ఇర్ఫాన్‌ఖాన్‌తో నటించాలన్న విషయాన్ని ఊహించుకుంటేనే చాలా భయమేస్తోంది: పరిణీతి చోప్రా
చాలా కాలం తరువాత ‘డిషూం’ చిత్రంలో ఐటెం సాంగ్‌లో కనిపించిన నటి పరిణీతి చోప్రాకు ఇప్పుడు మళ్లీ అవకాశాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మేరీ ప్యారీ బిందు’ చిత్రం ఉండగా మరోవైపు హోమి అద్జానియా దర్శకత్వంలో రానున్న ‘తకదుం’ సినిమాలోనూ ఆమె ఛాన్స్ కొట్టేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆ సినిమాలో నటుడు ఇర్ఫాన్‌ఖాన్ కూడా నటిస్తున్నాడని, ఆయన వంటి గొప్పనటుడి పక్కన నటించాలంటే తనకు చాలా భయంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. ఇర్ఫాన్‌ఖాన్ గ్లోబల్ ఐకాన్ అని ఆమె పేర్కొంది. ఆయన తనదైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడని ఆమె చెప్పింది. అందుకే తాను ఆయన పక్కన నటిస్తానన్న అంశాన్ని ఊహించుకుంటేనే భయమేస్తుందని చెప్పింది. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాలో నటించడం సంతోషంగానూ ఉందని చెప్పింది. ఇర్ఫాన్‌ఖాన్ లాంటి నటుడు పక్కన ఉంటే సహ నటులు ఎంతో జాగ్రత్తగా కష్టపడి పనిచేస్తారని, దీంతో మరింత గుర్తింపును తెచ్చుకోవచ్చని కూడా పేర్కొంది.