: హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత మరింత వేగవంతం.. నిన్న 200కు పైగా కూల్చివేత
హైదరాబాద్‌లో వరుసగా మూడోరోజు నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. దీనిని మరింత వేగవంతం చేసినట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నిన్న 200కు పైగా నిర్మాణాలని కూల్చివేసినట్లు తెలిపారు. ఈరోజు మరిన్ని నిర్మాణాలు కూల్చివేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కొండాపూర్, మియాపూర్, మాతృశ్రీనగర్, గోకుల్‌ప్లాట్స్, శివరాంపల్లి, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, బుద్వేల్, శాస్త్రిపురం నాలాలపై ఉన్న అక్రమకట్టడాలను జీహెచ్ఎంసీ సిబ్బంది, సంబంధిత అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమకట్టడాలకు సంబంధించిన అన్ని ఆధారాలను చేతపట్టుకొని పనులు కొనసాగిస్తున్నారు.