: జీతం రూ. 1200... కోట్ల విలువైన ఆస్తులు, లగ్జరీ కార్లు... నివ్వెరపోయిన అధికారులు!
అతనో సేల్స్ మెన్... నెలంతా కష్టపడితే వచ్చేది కేవలం రూ. 1200 మాత్రమే. అయితే అతని వద్ద బొలేరో, ఆల్టో కార్లు, యాక్టివా, షైన్ ద్విచక్రవాహనాలు ఉన్నాయి. సంపాదనతో పోలిస్తే ఏకంగా 200 రెట్లు అక్రమంగా కూడబెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సిధి జిల్లాలోని ఓ చిన్న దుకాణంలో సేల్స్ మెన్ గా ఉన్న సురేష్ ప్రసాద్ పాండే ఆస్తులపై ఎవరో లోకాయుక్త అధికారులకు ఉప్పందించారు. దీంతో వారు దాడులు నిర్వహించి సోదాలు చేసి అవాక్కయ్యారు. అతని వద్ద కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులు లభించాయి. అతని వద్ద 8 బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలున్నాయి. ఇప్పుడిక ఇంత ఎలా సంపాదించాడన్న విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు.