: ఉరీ ఉగ్రదాడి భారత్ పనేనట.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉరీ ఉగ్రదాడితో ఒంటరైన పాకిస్థాన్ ఈసారి తన రూటు మార్చింది. ఉరీ ఉగ్రదాడి భారత్ సృష్టేనని పాక్ రక్షణమంత్రి క్వాజా ఎం.అసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఇలా చేయడం అలవాటేనని, ఏళ్ల తరబడి ఇదే విధానాన్ని అవలంబిస్తోందంటూ దుమ్మెత్తి పోశారు. ఉరీ దాడిని ఆ దేశమే సృష్టించినట్టు తాము బలంగా నమ్ముతున్నట్టు ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉరీ ఘటనతో ప్రపంచ దేశాల నుంచి వస్తున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ రోజుకో ప్రకటన చేస్తూ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పాక్ ప్రధాని కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌లో ఏ చిన్న ఘటన జరిగినా పాక్ వైపు వేలెత్తి చూపడం భారత్‌కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.