: 20 లక్షల మంది ప్రజలు కావాలో.. 8 మంది దోపిడీదారులు కావాలో చంద్రబాబు తేల్చుకోవాలి: 'అగ్రిగోల్డ్' కుంభకోణంపై సీపీఐ నేత ముప్పాల


రాష్ట్రంలోని 20 లక్షల మంది ప్రజలు కావాలో లేక వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన 8 మంది దోపిడీదారులు కావాలో ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. నెల్లూరులో మంగళవారం జరిగిన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు లక్షలమంది యువత అగ్రిగోల్డ్ ఏజెంట్లుగా చేరి 20 లక్షల కుటుంబాల నుంచి డిపాజిట్లు సేకరించారని తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మొత్తం రూ.11 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, కానీ ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారని విమర్శించారు. మిగలిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News