: టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల ఆఫీసుపై ఐటీ దాడులు
టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆఫీసుపై ఐటీ శాఖ దాడులు చేసింది. అనంతరం బెంగళూరులోని మోదుగుల నివాసంలో కూడా దాడులు నిర్వహిస్తోంది. వ్యాపారవేత్త అయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలో టీడీపీ ఎంపీగా పని చేసి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన ఆఫీసు, నివాసంపై ఐటీ దాడులు చేయడం రాజకీయ వర్గాలలో కలకలం రేగుతోంది.