: సినిమాల్లో నటిస్తానని నవీన్ చెబితే...నిజమే చెబుతున్నాడా? అన్న అనుమానం వచ్చింది: మహేష్ బాబు


నవీన్ తండ్రిగా నరేష్ చాలా గర్వపడుతున్నారని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆకాంక్షించాడు. 'నందిని నర్సింగ్ హోం' సినిమా ఆడియో వేడుకకు హాజరైన మహేష్ బాబు మాట్లాడుతూ, నవీన్ మంచి నటుడిగా నిరూపించుకోవాలని అన్నాడు. నవీన్ మంచి ఎడిటర్ అని కితాబు ఇచ్చాడు. సినిమాల్లో చాలా కష్టమైన పని ఎడిటింగ్ అని, అది చాలా బాగా చేసి, నిరూపించుకుని నవీన్ సినిమాల్లోకి వచ్చాడని మహేష్ అన్నాడు. పోకిరి సినిమా టైంలో సినిమాలో ఎలా కనిపిస్తే బాగుంటుందని అడిగేందుకు నవీన్ దగ్గరకు వెళ్లేవాడినని మహేష్ బాబు తెలిపాడు. తన సినిమాలకు కూడా నవీన్ ఎడిటర్ గా పని చేశాడని మహేష్ బాబు చెప్పాడు. 'నవీన్ ని చాలా కాలం క్రిందట 'ఏం చేద్దామనుకుంటున్నావ్?' అనడిగితే ఆర్టిస్టునవుదామనుకుంటున్నానని చెప్పాడు. బాగా లావుగా ఉండేవాడు... అందుకే సరదాగా అంటున్నాడా? నిజంగా అంటున్నాడా? అన్న అనుమానం వచ్చింది' అని మహేష్ గుర్తు చేసుకున్నాడు. ఏడాది తిరిగే సరికి సిక్స్ ప్యాక్ తో వచ్చాడు. నవీన్ ఇంతలా ఎలా మారాడా? అని ఆశ్చర్యపోయానని మహేష్ బాబు చెప్పాడు. అంత కష్టపడి నటుడైన కుర్రాడి సినిమా కాబట్టి ఇది హిట్ కావాలని ఆకాంక్షించాడు. నవీన్ బేసికల్ గా ఎడిటర్ కనుక సినిమా మీద మంచి జడ్జిమెంట్ ఉంటుందని మహేష్ తెలిపాడు.

  • Loading...

More Telugu News