: నయామ్ తో సంబంధాలున్న వ్యక్తుల గన్ లైసెన్సులు రద్దు?
పోలీసుల ఎన్ కౌంటర్ లో ఇటీవల హతమైన గ్యాంగ్ స్టర్ నయామ్ తో సంబంధాలున్న వ్యక్తులు తమ వద్ద ఉన్న గన్ లను సరెండర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. గన్ లు సరెండర్ చేయాల్సిన వారిలో అధికార, ప్రతిపక్ష నేతలు ఉన్నట్లు సమాచారం. వారి గన్ లైసెన్స్ లు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నయీమ్ కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేసినట్లు సమాచారం.