: మహేష్ బాబుతో కృష్ణగారి వారసులంతా కలసి ఒక సినిమాలో నటించాలన్నదే నా కోరిక!: విజయనిర్మల


50 ఏళ్ల క్రితం 'తేనె మనసులు' చిత్రానికి ఎంపికైనప్పుడు అసలు ఎలా మాట్లాడాలి, ఎలా నటించాలి, ఎలా డాన్స్ చేయాలి... వంటివేమీ తనకు తెలియదని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. హైదరాబాదులో జరుగుతున్నా 'నందిని నర్సింగ్ హోం' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, డైరెక్టరు ఆదుర్తి సుబ్బారావుగారు అన్నీ నేర్పారని, అప్పట్లో నాలుగు నెలల పాటు అన్నీ నేర్పి సినిమాలు తీసేవారని అన్నారు. ఇప్పుటి తరం రెండు మూడేళ్లు శిక్షణ తీసుకుని సినిమాల్లోకి వస్తున్నారని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమా హీరో హీరోయిన్లకు అభిమానుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. నిర్మాత, దర్శకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ, శంఖారావం సినిమాలో మహేష్ బాబు, నవీన్ కలిసి నటించారని అన్నారు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా నవీన్ తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. 'మహేష్ బాబుతో కృష్ణగారి వారసులంతా కలిసి ఒక సినిమాలో నటించాలన్నదే నా కోరిక' అని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News