: సైనిక దుస్తుల్లో సంచరిస్తున్న నలుగురు వ్యక్తులు.. పఠాన్ కోట్ లో హై అలర్ట్


గుర్తుతెలియని వ్యక్తులు సైనిక దుస్తుల్లో సంచరిస్తున్నారనే సమాచారం మేరకు పంజాబ్ లోని పఠాన్ కోట్ లో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. పఠాన్ కోట్-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని చక్కి ఖాద్ వద్ద నలుగురు వ్యక్తులు సైనిక దుస్తుల్లో పర్యటిస్తున్నారని ఒక మహిళ ఈరోజు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైనిక దుస్తుల్లో సంచరిస్తున్న నలుగురు వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ అధికారులను పంజాబ్ భద్రతా సిబ్బంది హెచ్చరించారు. కాగా, జనవరిలో పఠాన్ కోట్ లోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ ఘటనలో 18 మంది సైనికులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News