: ధోనీ సినిమాలో రాంచరణ్?


ధోనీ సినిమాలో రాంచరణ్ కనిపించనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ధోనీ ఆటోబయోగ్రఫీ నేపథ్యంలో రూపొందిన 'ఎం.ఎస్. ధోనీ: ఏన్ అన్ టోల్డ్ స్టోరీ' సినిమాలో ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషిస్తుండగా, కెరీర్ లో ధోనీతోపాటు ప్రయాణించిన సురేష్ రైనా పాత్రను రాంచరణ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని టీం గోప్యంగా ఉంచినట్టు చెబుతున్నారు. కోహ్లీ పాత్రలో ఫవాద్ ఖాన్ నటించాడు. ధోనీ అక్క పాత్రను భూమికా చావ్లా, ప్రియురాలి పాత్రను దిశా పటానీ పోషించగా, భార్య పాత్రను కైరా అడ్వానీ చేసింది. హిందీ, తెలుగు, తమిళ్‌, మరాఠీ భాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లోను, టీజర్‌, ట్రైలర్‌ లోను రాంచరణ్‌ తోపాటు, ఫవాద్ ఖాన్ కూడా కనిపించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News