: సచిన్ కొడుకు అర్జున్ కి, పాప్ స్టార్ జస్టిన్ బీబర్ కు పోలికలున్నాయట!


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ కి, కెనడియన్ పాప్ మ్యూజిక్ సెన్సేషన్ జస్టిన్ బీబర్ కు పోలికలున్నాయంటూ ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని ఇటీవల వ్యక్తం చేశాడు. ఈ నెల 24వ తేదీన అర్జున్ తన 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ముంబైలోని సచిన్ నివాసంలో అర్జున్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తన తండ్రితో అర్జున్ ఒక ఫొటో దిగాడు. ఆ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. ఈ నేపథ్యంలో ఆ ఫొటోను చూసిన ఒకనెటిజన్ జస్టిన్ బీబర్ తో అర్జున్ కు పోలికలున్నాయంటూ వ్యాఖ్యానించాడు. బీబర్, అర్జున్ చిన్నప్పుడే తప్పిపోయిన సోదరులని, సురేష్-రమేష్ అంటూ వచ్చే ప్రముఖ యాడ్ లో లా వాళ్లిద్దరూ ఉన్నారంటూ నెటిజన్లు చమత్కరించారు.

  • Loading...

More Telugu News