: తిట్టుకోవడం కాదు.. ఏదంటే అది మాట్లాడటం కాదు.. చర్చిద్దాం రండి: కాంగ్రెస్ నాయకులకు వెంకయ్య సూచన


రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు లేనందునే ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చాము. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన బిల్లులో ఈ విషయాన్ని ఎందుకు చేర్చలేదు? కాంగ్రెస్ పాలనలో వాళ్లు ఏమి చేశారో ప్రజలకు చెప్పాలి.. తిట్టుకోవడం కాదు.. ఏదంటే అది మాట్లాడటం కాదు.. వ్యక్తిగత దూషణలు చేయడం కాదు.. చర్చిద్దాం రండి’ అంటూ కాంగ్రెస్ నాయకులకు వెంకయ్య నాయుడు సూచించారు.

  • Loading...

More Telugu News