: వెలగపూడికి ప్రభుత్వ ఫైళ్ల తరలింపు ప్రారంభం
ఏపీలో కొత్తగా కట్టిన వెలగపూడి సచివాలయానికి ఆయా కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా వెలగపూడికి ప్రభుత్వ ఫైళ్ల తరలింపు ప్రారంభమైంది. ఆర్థిక శాఖ ఫైల్ అక్కడికి చేరుకుంది. కాగా, ఐదు భవనాల్లో ప్రభుత్వ శాఖలకు విభాగాలు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. మొదటి భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో జీఏడీకి కేటాయించగా, మిగిలిన నాలుగు భవనాలను మిగతా అన్ని శాఖలకు కేటాయించారు. అక్టోబర్ 3 నుంచి వెలగపూడిలో పాలన ప్రారంభించాలని నిర్ణయించారు.